ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి ‘బయోపిక్‌’

narayana murti
narayana murti

బెంగళూరు: భారత్‌లో ఇపుడు బయోపిక్‌ల కాలం నడుస్తోంది. అనుకోని ప్రధానితో మన్మోహన్‌సింగ్‌, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపైనా, బాలకృష్ణనటించిన ఎన్‌టిఆర్‌ మహానాయకుడు, ముమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా వైఎస్‌రాజశేఖరరెడ్డి, రామగోపాల్‌వర్మ లక్ష్మీస్‌ఎన్‌టిఆర్‌ ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇపుడు అదేకోవలోనికి ప్రముఖ బిజినెస్‌ దిగ్గజం, ఐటి సేవల రెండో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్‌వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి జీవితచరిత్ర ఆధారంగా చిత్రం రూపొందుతున్నట్లు కార్పొరేట్‌ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంఓది. చిత్రనిర్మాత సంజ§్‌ు త్రిపాఠి ఎనిమిది నెలలక్రితమే మూర్తిని కలిసి ఆయనపై చిత్రం అభిలాషను వ్యక్తంచేసారు. కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఈ చర్చల్లో ఉన్నట్లు తెలిసింది. మూర్తిని రెండుపర్యాయాలు ఆయన ఇంట్లోనే త్రిపాఠి కలిసి చర్చిస్తే నారాయణమూర్తి అందుకు ఆమోదం తెలిపారు. అయితే వాస్తవాలను మభ్యపెట్టవద్దని మాత్రం కోరారని వినికిడి. మూర్తి తొలినాళ్లలో రూ.10వేల రుణాన్ని తన భార్యనుంచే తీసుకుని కంపెనీనీ ప్రారంభించారని, ఈ అంశాన్ని అలాగే కొనసాగించాలనికోరారని తెలిసింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్‌ గత ఏడాదిచివరినాటికి 10.94 బిలియన్‌ డాలర్ల రాబడులతో కొనసాగుతోంది. కంపెనీ భారత్‌లోనే ఉన్నప్పటికీ ప్రపంచ సాప్ట్‌వేర్‌ రంగంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. 72 ఏళ్ల నారాయణమూర్తికి 2.3 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్‌ అంచనావేసింది. ఇక మూవీపరంగా చూస్తే ఇన్ఫోసిస్‌పై మూర్తి పుస్తకం రాసారని చెపుతున్నారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడు అయిన ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాకులు దక్షిణ కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌జిల్లాలో జన్మించారు. ఐఐటి కాన్పూర్‌నుంచి మాస్టర్స్‌ డిగ్రీచేసారు. పట్ని కంప్యూటర్‌సిస్టమ్స్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత 35 ఏళ్ల వయసులో మూర్తి పూణెకకు ఇన్ఫోసిస్‌ను ప్రారంభించాలని వెళ్లారు. ఆయన తన ఇంటినుంచే సాఫ్ట్‌వేర్‌ సేవలందించే కంపెనీగా ప్రారంబించి తదనంతరం కార్యాలయానికి షిప్ట్‌చేసారు. 1981నుంచి 2002 వరకూ ఇన్ఫోసిస్‌కు సిఇఒగాపనిచేసారు. తదనంతరం కంపెనీ ఛైర్మన్‌గా 2011లో వైదొలిగారు. తిరిగి 2013లో మళ్లీ చేపట్టారు. అనంతరం విశాల్‌సిక్కా సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. త్రిపాఠి ఇప్పటికే 30 పేజీల స్క్రిప్ట్‌ను మూర్తికి హిందీలో అందచేసారని తదనంతరం ఇంగ్లీషు తర్జుమా కాపీలు కూడా అందించారని అంచనా. వచ్చే కొన్నినెలల్లోనే ప్రారంభిస్తారని అంచనా. 2007లో మణిరత్నం గురు సినిమాతో బయోపిక్‌లు ప్రారంభం అయ్యాయి. ధీరూభా§్‌ు అంబాని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేతనుంచి ఈ చిత్రాలువస్తున్నాయి. స్క్రిప్టు ఖరారయిన తర్వాత లొకేషన్లను ఎంపికచేస్తామని అదేసమయంలో నటులు ఎంపిక జరుగుతుంది. మూర్తి పాత్రను ఎవరిని ఎంపికచేస్తారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. మూర్తికి 0.38శాతం ఇన్ఫోసిస్‌లో వాటాలున్నాయి. ఆయన భర్యా సుధా, కుమార్తె అక్షత, కుమారుడు రోహన్‌లకు 3.07శాతం వాటాలున్నాయి. మొత్తం కుటుంబపరంగా 3.45శాతం వాటాలున్నాయి.