ఇన్ఫోసిస్‌కు ఢోకాలేదు!

INFOSYS1
ఇన్ఫోసిస్‌కు ఢోకాలేదు!

ముంబై, ఏప్రిల్‌ 17: ఇన్ఫోసిస్‌, టెక్‌ జెయింట్‌ శుక్రవారం ప్రకటించిన ఫలితాలు బాగానే ఉన్నా, అద్భుతంగా మాత్రం లేవు. అందుకే ఈ కంపెనీ షేరు ఆరు శాతం వరకూ నష్టపోయింది. ఇలా జరుగుతుందని ముందే ఊహించారు కూడా. అయినా ఆర్థిక నిపుణులు మాత్రం ఈ కంపెనీ షేరును కొనుగోలు చేయమనే అంటున్నారు. కనీసం తొమ్మిది బ్రేకరేజీ కంపెనీలు ఇన్ఫోసిస్‌ కంపెనీ షేరుకు బ§్‌ు రేటింగ్‌ ఇచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 22-24శాతానికి ఎబిట్‌ మార్జిన్‌ గైడెన్స్‌ తగ్గించింది. ఇది గతం లో 23-25శాతంగా అంచనా వేశారు. ఆదాయ ఫలితాలు ప్రకటించిన తర్వాత అమెరికా ఏడిఆర్స్‌ కూడా 7.7శాతం పడిపోయాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే మన మార్కెట్లలోనూ ఇన్ఫోసిస్‌ షేరు ఆరు శాతం వరకూ పతనం కావచ్చని ముందు గానే అంచనా వేశారు. ఓపెన్‌ ఇంట్రస్ట్‌లో అత్యధికం గా రూ.1100 పుట్‌కి 20.75లక్షల షేర్లు రికార్డ య్యాయి. ఐఐఎఫ్‌ఎల్‌ అంచనా ప్రకారం ఇదే విలు వ వద్ద ఇన్ఫోసిస్‌ షేరుకి మద్దతు లభించవచ్చు.

అదే నిరోధస్థాయినిచూస్తే ఏప్రిల్‌లో రూ.1180, రూ.1200వద్ద ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ చెబుతోం ది. ఈ ఏడాది జనవరి నుంచీ ఇన్ఫోసిస్‌ రూఏ.1100-రూ.1221 మధ్యలోనే రేంజ్‌ బౌండ్‌ అయి ట్రేడవటం గమనిస్తూనే ఉన్నాం. గైడెన్స్‌ తగ్గింపుతో ఇన్ఫోసిస్‌ తన 170 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో డిజిటల్‌ సామర్థ్యాన్ని పెంచుకోనుందని అంచనా. ఇది అమ్మకాలు, అమెరికాలో ఉద్యోగులను తీసుకోవడం, ఇతర జీతభత్యాలను కవర్‌ చేస్తుందని సిఎల్‌ఎస్‌ఎ చెబుతోంది. ఇది దాదాప 9శాతం వృద్ధి సాధిం చేందుకు దోహదపడుతుం దని రీసెర్చ్‌ సంస్థ లెక్కగడుతోంది. ఇన్ఫోసిస్‌ సుస్థిరత వృద్ధి సాధిస్తుందని సిఎల్‌ఎస్‌ఎ చెప్తూ రూ.1340 టార్గెట్‌ ధరని కంటిన్యూ చేసింది. గైడెన్స్‌ తగ్గింపు పెద్ద నిరాశాకర పరిణామంగా భావించినా కూడా, భవిష్యత్తు వృద్ధికి ఇది దోహదపడుతుందని ఫిలిప్‌ కేపిటల్‌ కూడా అభిప్రా యపడింది.

వ్యాపారపరిమాణం పెరగడం, టిసిఎస్‌తో పోల్చు కుంటే, గమనించదగ్గ వేల్యేషన్‌ తేడా ఉండటం కూడా చూడాలి. పనాయా, స్కావాడీల్స్‌ వల్లనే గైడెన్స్‌ తగ్గించాల్సి వచ్చిందే వాస్తవా న్ని కూడా గుర్తుచేసుకోవా లని ఫిలిప్‌ కేపిటల్‌ హెచ్చరిం చింది. గైడెన్స్‌ తగ్గింపు మార్కె ట్లు ప్రతికూలంగా తీసుకుంటా యి. దీంతో ఎడెల్వైజ్‌ కూడా 2019 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ను 0.7శాతం, 202 సంవత్స రానికి 4.2శాతం తగ్గించిం ది. షేర్‌ హోల్డర్లకు రూ.13000 కోట్ల మేర తిరిగి చెల్లించ డానికి కూడా సంస్థపై సానుకూల కారణాలుగా చూస్తోంది. అందుకే సంస్థ షేరుకు రూ.1419 టార్గెట్‌ ధరని రికమండ్‌ చేస్తోంది. ఈ సంస్థ ఇన్ఫీ రెవెన్యూ ఎదుగుదలకు గైడెన్స్‌6-8శాతం ఉండొచ్చ ని చెప్పడం కొటక్‌ ఇన్సిట్యూషనల్‌ ఈక్వి టీస్‌ పాజిటివ్‌గా చూస్తోంది. అందుకే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ ఫోలియోలో ఇన్ఫోసిస్‌ను చేర్చుకోమని చెప్తోంది. రూ.1250 వరకూ సంస్థ షేరు పెరుగుతుందని సూచిస్తోంది.