‘ఇన్ఫీ’ నూతన చైర్మన్ నందన్ నిలేకని

బెంగళూరు : ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా నందన్ నీలేకని పేరును అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటి వరకు ఇన్ఫీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆర్.శేషసాయి, కో ఛైర్మన్ రవి వెంకటేశన్లు రాజీనామాలు
చేశారు. వీరిలో రవి వెంకటేశన్ స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు. దీంతో పాటు విశాల్ సిక్కా, జెఫ్రీ ఎస్ .
లెహ్మన్, జాన్ఎట్కెమెండీ బోర్డు నుంచి వెళ్లిపోయారు. కాగా నీలేకనిని కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా, నాన్
ఎగ్జిక్యూటీవ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా నియమించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ గురువారం
సాయంత్రం రెగ్యూలేటరీకి చేసిన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సందర్భంగా నిలేకని మాట్లాడుతూ ‘ఇన్ఫోసిస్‌కు
తిరిగి రావడం నాకు సంతోషానిస్తోంది. నేటి నుంచి నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాను. నా
సహచరులతో కలిసి భవిష్యత్తు కోసం పనిచేస్తాను. మా ఖాతాదారులకు, వాటాదారులకు, ఉద్యోగులకు,
మంచి ఫలితాలను ఇవ్వడమే లక్ష్యం.’ అని ఆయన తెలిపారు.