ఇనుము- ఉక్కు

తెలుసుకోండి

ఇనుము- ఉక్కు

IRON, STEEL
IRON, STEEL

ఇనుము భూమిపొరల్లో ఖనిజ రూపంలో ఉంటుంది. ఇది బంగారంలాగా లోహ రూపంలో కాకుండా ఆక్సిజన్‌ లేదా సల్ఫర్‌ సమ్మేళనాల రూపంలో దొరుకుతుంది. హెమటైట్‌, మాగ్నటైట్‌ రూపాల్లో ఇనుప ఖనిజం సాధారణంగా లభిస్తుంది. ఇందులో ఇనుప పరమాణువ్ఞలు మూడు ఎలక్ట్రాన్‌లను పోగొట్టుకున్న ధన ఆక్సీకరణ స్థితిలో ఉంటాయి. అంటే ఇనుప ఖని జం నుంచి మామూలు ఇనుము రావాలంటే ఖనిజం లోని ప్రతి ఇనుప పరమాణువ్ఞ స్థావరానికి మూడు ఎలక్ట్రాన్‌ల చొప్పున కలపాలి. ఇలా ఒక పదార్థానికి ఎలక్ట్రాన్‌లను సరఫరా చేసే ప్రక్రియను క్షయకరణం అంటారు.

ఇనుప ఖనిజాన్నుంచి ఇనుమును తయారు చేయాలంటే దాన్ని క్షయకరణం చెందించాలన్నమాట. ఇందుకోసం పురాతనకాలం నుంచి బొగ్గును వాడుతు న్నారు. గతంలో పెద్ద పెద్ద గుంతలు, జాడీల వంటి వాటిని క్షయకరణం కోసం వాడేవారు. ఆధునిక పారిశ్రామిక రంగంలో పెద్ద పెద్ద విద్యుత్‌ కొలుముల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద బొగ్గుపొడి, చార్కో ల్‌ వంటి పదార్థాలతో క్షయకరణం చేస్తున్నారు. ఇందుకోసం బెస్సిమర్‌ కొలిమి, రివర్బరేటరీ కొలిమి వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.

భూమి పొరల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని గని కార్మికులు తవ్వి బయ టకు తీశాక ఆ ఖనిజాన్ని ఇనుప, ఉక్కు కర్మాగారాల్లో కార్మికులు కొలుముల్లో క్షయకరణం చెందించి ఇనుము, ఉక్కుగా మారుస్తారు. ఇనుము, ఉక్కు తయార య్యాక వివిధ రకాలైన మూసలలో పోసి ఇనుప సామగ్రిని తయారుచేస్తారు.