కాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది, ఒక టెర్ర‌రిస్టు హ‌తం

encounter
encounter

శ్రీన‌గ‌ర్ః జమ్మూకశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు శుక్రవారంనాడు భగ్నం చేశాయి. భారత భూభాగంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులపై బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రతి ఏడాది శీతాకాలం, దట్టమైన మంచు దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో పెద్దఎత్తున ఉగ్రవాదులను భారత భూభాగంలోకి చొప్పిస్తూ పాక్ తన దుష్టపన్నాగాలు సాగిస్తుండటం పరిపాటైంది. జమ్మూకశ్మీర్‌లోని సంబూరా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఒక టెర్రిరిస్టు హతమయ్యాడు.