ఇద్ద‌రు భార‌త అథ్లెట్ల స‌స్పెన్ష‌న్‌

IRPHAN KOLOTHUM, RAKESH BABU
IRPHAN KOLOTHUM, RAKESH BABU

గోల్డ్ కోస్ట్ః కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ‘నో నీడిల్స్‌’ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత అథ్లెట్లు రాకేశ్‌ బాబు, ఇర్ఫాన్‌ కోలోథమ్‌ థోడ్‌పై కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్(సీజీఎఫ్‌)‌ చర్యలు తీసుకుంది. వారిని వెంటనే గోల్డ్‌కోస్ట్‌ వదిలి స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఈ ఇద్దరి అథ్లెట్ల గదిలో నీడిల్‌ దొరకడంతో ఫెడరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. వారి అక్రిడిటేషన్‌ను కూడా రద్దు చేశాం అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు లూయిన్‌ మార్టిన్‌ వెల్లడించారు.ఆటగాళ్లు డోపింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు ఈ ‘నో నీడిల్స్‌ ’ పాలసీని అమలు చేస్తున్నారు.