ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నాo

Treatment

మంచిర్యాల జిల్లా:  లక్షెట్టిపేటలోని బాలికల హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీనియర్లు వేధించారని శిరీష, సాయినిధి అనే విద్యార్థినులు యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.