ఇద్దరు మావోయిస్టు ముఖ్యనేతలు అరెస్టు

Mavoists
Mavoists

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇద్దరు మావోయిస్టు ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, సాంబయ్య భార్య లోకే సారమ్మ అలియాస్ సుజాతగా గుర్తించారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం ఏరియా బాధ్యులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం మావోయిస్టు నేతలను కొత్తగూడెం తరలించారు.