ఇద్దరు ఎంపీల బహిష్కరణ

Mamatha benerjee
Mamatha benerjee
కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌లోని అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలపై అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి వారిని బహిష్కరించింది. బుధవారంనాడు బీజేపీలో చేరిన బిష్ణుపూర్ ఎంపీ సుమిత్రా ఖాన్‌తో పాటు, బోలాపూర్ లోక్‌సభ ఎంపీ అనుపమ్ హజారేను పార్టీ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఈ ఇద్దర్నీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది. కాగా, బహిష్కరణ వేటు పడిన అనుపమ్ హజారే సైతం ఖాన్ అడుగుజాడల్లోనే బీజేపీ తీర్థం తీసుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.