ఇదొ ప్రేమలోకం ఆడియో విడుదల!

EDO PREMA LOKAM11
EDO PREMA LOKAM Audio Releas

ఇదొ ప్రేమలోకం ఆడియో విడుదల!

డా.స్వర్ణలత, సురేష్‌బాబు సమర్పణలో శ్రీ శ్రీనివాస ఫిలింస్‌ బ్యానర్‌పై డా.అశోక్‌ చంద్ర, తేజరెడ్డి, కారుణ్య హీరో హీరోయిన్లుగా కరణ్‌రాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.పి.నాయుడు నిర్మించిన చిత్రం ఇదొ ప్రేమలోకం. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను లయన్‌ సాయివెంకట్‌ విడుదల చేసి తొలి సీడీని సీనియర్‌ నరేష్‌కు అందించారు. ఈ సందర్భంగా… సాయివెంకట్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా మేకింగ్‌ చాలా బావుంది. వందేమాతరం శ్రీనివాస్‌గారు మంచి మ్యూజిక్‌ అందించారు.

నాటక రంగం నుండి వచ్చిన ఎస్‌.పి.నాయుడుగారు, కొడుకు అశోక్‌ చంద్రను డాక్టరు చదివించినా, తన కోరిక తీర్చుకోవాలని కొడుకుని హీరో చేశారు. అశోక్‌ చక్కగా నటించాడు అన్నారు. దర్శకుడు కరణ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నరేష్‌గారి క్యారెక్టర్‌ హైలైట్‌. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పిస్తారు. అలాగే మరో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌లో సుమన్‌గారు నటించారు. వందేమాతరంగారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.

నిర్మాత ఎస్‌.పి.నాయుడు మాట్లాడుతూ.. నేను 30 ఏళ్ళు నాటకాల్లో కూడా నటించాను. నా ఆలోచనలతో నా కొడుకుని డాక్టరు చేసినా, కరణ్‌రాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో హీరోగా పెట్టి సినిమాను నిర్మించాను. నరేష్‌గారు ఎంతో అద్భుతంగా నటించారు. వందేమాతరంగారు ఎంతో మంచి ట్యూన్స్‌ను అందించారు అన్నారు. సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ.. లవ్‌స్టోరీలో కొత్త కోణంలో కనపడుతుంది. అశోక్‌ కొత్తవాడైనా ఎంతో చక్కగా నటించాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉంటుంది అన్నారు. హీరో డా.అశోక్‌ చంద్ర మాట్లాడుతూ.. కరణ్‌రాజ్‌గారు ఎంతో చక్కగా డైరెక్ట్‌ చేశారు. వందేమాతరం శ్రీనివాస్‌గారు చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు అన్నారు.