ఇదే ఫామ్‌ కొనసాగిస్తా

hardik pandya
hardik pandya, indian cricketer

న్యూఢిల్లీ: ఇక నుంచి ఇదే ఫామ్‌ కొనసాగిస్తానని ముంబై ఇండియన్స్‌ ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించడంతో తన ఖాతాలో రెండో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వేసుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్‌ పాండ్య 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ ఐపిఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచుల్లో 218 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలుచుకోవడంపై హార్ధిక్‌ మాట్లాడాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/