ఇదే ఐశ్వర్యం!

ఆధ్యాత్మిక చింతన—

bhagavad gita
bhagavad gita


భగవద్గీత హిందువులకు పరమ పవిత్ర గ్రంథం. ఈ గ్రంథాన్ని శ్రద్ధ, భక్తినిష్టతో చదివి మానవ్ఞడు తన కర్తవ్యాన్ని గుర్తించి, పరోపకార భావంతో, యుక్తా యుక్తవిచక్షణతో ప్రవర్తించి జీవితం సార్ధకం చేసుకోవాలన్నదే గీతాహృదయం.

గీత మానవుడిని మాధవుని స్థాయికి చేర్చి, ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాల్ని తొలగించి, ఆత్మసాక్షాత్కారమును కలిగించి ఆశీర్వదిస్తుంది. శాంతిని ప్రసాదిస్తుంది. గీత ముక్తి ప్రదాయక దివ్యగీత. భారతీయ తత్త్వవేతలేకాదు, ఇంగ్లీషువారైనా థామస్‌ కార్లెల్‌, ఎమర్సన్‌, వారెన్‌ హేస్టింగ్స్‌ మొదలైన మహామహులు కూడా గీతను ఏకంగా అనువాదం చేసి, ప్రసిద్ధి చెందారు.

అద్విన్‌ ఆర్నాల్డ్‌ గీతను పద్య రూపంలో రచించాడంటే గీత వైశిష్టం, విశ్వసనీయత ఇట్టే బోధపడుతుంది. గీతలో ముఖ్యంగా ఈశ్వరరూపుడైన శ్రీకృష్ణుబోధలు మనకు లభిస్తాయి. మానవుని మనసుకు అందని ఈశ్వరుణ్ణి భగవద్గీతలో నిర్వచించిన తీరు మరే ఇతర పవిత్ర గ్రంథంలో కాని, వాజ్మయంలో కాని కనపడదు.

ఈశ్వరుడు శ్రీకృష్ణుని అవతారంలో ఈ భూమ్మీదకి దిగి, తానెవరో మానవునికి అనేక విధాలుగా తెలియజేస్తాడు. నీ స్వప్నాలు సాకార మవుతాయి. అంతటితో నీ అన్వేషణ ఆగిపోతుందని చెపుతుంది భగవద్గీత. నీ ఆశకు, నీ ప్రశ్నలకు జవాబు ఈశ్వరుడొక్కడే.

ఆయన్ని చేరుకుంటేగాని శాశ్వత సుఖం లేదు. నీ సంశయాలు తీరవ్ఞ. వీటన్నింటిని దాటి, ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో చెపుతాను విను అంటుంది విశ్వమత గ్రంథం భగవద్గీత. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దారి చూపేవారున్నారు, చేయూత ఇచ్చి సాయం చేయగలిగే వారున్నారు.

కాని వారు ఆయన్ని మాత్రం ఇవ్వలేరు. జ్ఞానులు తమకు అంతా తెలుసంటారు కాని వారు చెప్పింది అర్ధం కాదు. భక్తుల విషయం కూడా అంతే. వారికి భక్తి ద్వారా లభించిన ఆత్మతృప్తిని, ఆ మహానందాన్ని మనకు అందివ్వలేరు. కనుకనే ఎవరికి వారు ఆ ఈశ్వరుని విశ్వసించి, శరణువేడి, సాధన ద్వారానే ఆయన అనుగ్రహంతోనే దర్శనం సాధించాలి. శాంతిని పొందాలి.


ఈశ్వరుణ్ణి గురించి అనేక నిర్వచనాలు చెప్పాడు. నిజానికి మానవునికి అర్ధం కావడానికే స్వామి అనేక నిర్వచనాలు చెప్పాడు. కాని ఈశ్వరుని స్వభావం అనిర్వచనీయం. అనుభవిం చవలసిందే. ఐక్యం కావాల్సిందే తప్ప ఆయన్ని గురించి తెలుసుకోవడం, నిర్వచించడం మానవునికి అసాధ్యమైన పని అనేది నిర్వివాదం. అయినా భగవాన్‌ మహా యోగీశ్వరుడైన పార్ధుని మానసిక స్థితిని గమనించి ఈశ్వర నిర్వచనాన్ని అందించిన తీరును తెలుసుకుందాం.

పరమాత్మ తత్వాన్ని గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. శాశ్వతమైనవాణ్ణి జ్యోతులన్నింటికి జ్యోతి, తమస్సుకు అతీతుడు అతడే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, అందరి హృదయాలలో ఉండే ‘నీళ్లలో రసం, సూర్యచంద్రుల్లో కాంతి, అన్ని వేదాలలోని ప్రణవం. ఆకాశంలోని శబ్దం, మనుష్యుల్లోని పౌరుషం నేను ఇలా ఈ మహనీయ శ్లోకాల భావాల్ని ఆకళింపు చేసుకుంటే ఆ మాట్లాడేది ఈశ్వరుడు కాక మరెవరవుతారు?

అర్జునుడు శ్రీకృష్ణభక్తుడు, సఖుడు, అడుతూ పాడుతూ తిరిగిన వారు. అప్పటివరకు తన మనస్సులో స్థిరీకరించుకున్న స్నేహితుడు ఒక్కసారి చేసిన ఈ అద్భుతబోధ విన్న అర్జునుని మనస్థితి ఎలా ఉండి ఉంటుందో, ఊహించగలమా. కనుక వేదాంతపరంగా, శాస్త్రపరంగా, నీతి పరంగా, బుద్ధిపరంగా, ఆశపరంగా, అవమాన భీతిపరంగా తన ప్రియస్నేహితుణ్ణి లోకోత్తర కాంతిని దర్శించడానికై కనుక తెరిపిం చటయే శ్రీకృష్ణుని లక్ష్యం. గీతాసారం. అదే ఐశ్వర్యం.