ఇదేనా క్రీడాస్ఫూర్తి

GALE-
dance

ఇదేనా క్రీడాస్ఫూర్తి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్రీడాభిమానులకు ఆగ్రహంకు గురిచేస్తున్నాయి. ఆటగాళ్లు క్రీడా మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి ప్రవర్తిస్తున్న సంఘటనలు చోటుచేసుకోవడం బాధకరం. అంతర్జాతీయ క్రికెట్‌లో జట్టు విజయం కోసం క్రీడారులు దిగజారుతున్నారు. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జరిగిన బాల్‌ టాంపరింగ్‌ సంఘటన అంతర్జాతీయ క్రికెట్‌ను కుదిపి వేస్తోంది. క్రికెట్‌పై అభిమానులకు మంచి అభిప్రాయం ఉండేది. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో క్రికెట్‌కు రాబోయే రోజుల్లో స్పందన కరువైయ్యే అవకాశాలు లేకపోదు

నిదహాస్‌ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు శ్రీలంకపై విజయం సాధించి నాగిని డ్యాన్స్‌ చేయడంతో శ్రీలంక క్రికెట్‌ అభిమానులు ఆగ్రహంకు గురైయ్యారు. ప్రంపచ కప్‌ క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో వెస్టీండీిస్‌, ఆప్గానిస్ధాన్‌ ఇరుజట్ల క్రీడాకారులు క్రిస్‌గేల్‌, షాహజాద్‌లు కలిసి మైదానంలో నృత్యాలు చేయ డం క్రీడాభిమానులను అశ్చర్యంకు గురి చేశాయి.