ఇది విరాట్‌ కోహ్లీ శకం

Gavaskar-Sehwag
న్యూఢిల్లీ : టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్న టెస్ట్‌ కెప్టెన్‌ కోహ్లీపై మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌, సెహ్వాగ్‌లు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా భారత క్రికెట్‌లో కోహ్లీ శకం ప్రారంభమైందంటూ గవాస్కర్‌ కొనియాడాడు.గత ఏడాది భారత క్రికెట్‌ జట్టు టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ ఆటతీరులో విజయాలు సాధించి పెడుతున్నాడు. కోహ్లీది భిన్నమైన శైలి ప్రస్తుత టీమిండియా క్రికెట్‌ శకం అత్యంత వినోదాత్మకంగా సాగుతుంది.కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కాకపోయినా ఇది ఖచ్చితంగా కోహ్లీ శకమే అని గవాస్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయితే సెహ్వాగ్‌ మర అడుగు ముందుకేసి కోహ్లీని సచిన్‌తో పోల్లాడు. టీమిండియాకు దొరికిన కొత్త సచిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే కోహ్లీయే అని పేర్కొన్నాడు. టార్గెట్‌ చేధించే క్రమంలో మేటి ఆటగాళ్ల రికార్డులను పరిశీలిస్తే కోహ్లీ యావరేజ్‌ అమోఘం,అదే అతన్ని వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఆటగాడిగా నిరూపిస్తుంది.