ఇతరుల పొరపాట్ల నుంచి గుణపాఠాలు: సత్య నాదెళ్ల
ఇతరుల పొరపాట్ల నుంచి గుణపాఠాలు: సత్య నాదెళ్ల
హైదరాబాద్: ఇతరులు తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్‌లో టి-హబ్‌లో ప్రజలతో ముచ్చటించిన సత్య నాదెళ్ల కృత్రిమ మేధస్సు ఐటి భవిష్యత్‌ను నిర్దేశించనుందని అన్నారు. స్టార్ట్ అప్ కంపెనీలకు లభించే మద్దుతు ఐటి భవిష్యత్‌కు ఊతం కానున్నాయని అన్నారు. వైఫల్యాల నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానమన్నారు. కేేవలం వైఫల్యం ఒక్కటే ఏం సాధించలేదన్నారు. తన కెరీర్ ఇలా ఎదగటానికి కారణం తాను ఇతరుల నుంచి వారి వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకోవటమేనని సత్య నాదెళ్ల అన్నారు.