ఇతరుల గూర్చి ప్రార్థించే మనసుండాలి…

jesus
jesus

ప్రభువ్ఞ అత్యున్నతమైన ప్రేమను అనుభవించాలంటే మనసు ఒక ఆవేదనకు గురైనప్పుడే అది సాధ్యం. ఒక కష్టం దేవ్ఞడిపై ఆధారపడేలా చేస్తుంది. ఒక సమస్య ఆయనను ఆశ్రయించేలా పురికొల్పుతుంది. మనసుకు గాయమైనప్పుడు మనకు తెలియకుండానే ‘దేవా!, ‘ప్రభువా!, ‘తండ్రీ! వంటి పిలుపులతో ఆయన సన్నిధి కోసం పరితపిస్తాం. దేవ్ఞడి ఓదార్పే మనకు కొండంత అండ, ధైర్యాన్ని ఇస్తుంది. అదృశ్యమైన ఒక శక్తి, ఒక సహాయం మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి సముద్రంలో ఈత నేర్చుకోవాలని నిరీక్షిస్తున్నాడు.

ఎందుకు నిరీక్షిస్తున్నాడు అంటే? ఎగసిపడుతున్న అలల్ని చూస్తున్నకొద్దీ అతడిలో భయం పెరిగిపోతున్నది. అలలు ఎప్పుడు ఆగిపోతాయా! సముద్రం ఎప్పుడు నిర్మలంగా ఉంటుందా! ఎప్పుడు నీళ్లలో దూకుదామా! అని ఎదురుచూస్తున్నాడు. ఈత అనేది ఉప్పొంగే అలల్లోనుంచే నేర్చుకోవాలి. అలలు నిరంతరం ఎగసిపడుతూనే ఉంటా యి. సముద్రం స్వభావమే అది. ఈ జీవితం కూడా కష్టాలమయమే. ఇందులో మనం ఈదుతూ ఉండా ల్సిందే. నిరాశతో కృంగిపోయి, ఈ జీవితం ఎందుకని ఆవేదన చెందితే లాభం లేదు. యోబు తనకు నష్టం, బాధ కలిగినప్పుడు దేవ్ఞడిని నిందించలేదు.

ఆ బాధల్లోనే తన మిత్రుల గురించి ప్రార్థించాడు. తనే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటే ఇతరులగూర్చి ఏవిధంగా ప్రార్థించ గల్గాడు? కారణం తన కష్టాల్లో యోబు దేవ్ఞడిని దూషించలేదు. ఆయనపై సణుగుకొనలేదు. తన నిర్దోషిత్వంపై దేవ్ఞడినే ప్రార్థిం చాడు. ఇతడి కష్టాలను చూసిన అతని స్నేహితులు యోబును నిం దించారు,అవమానించారు, మనసు ను మరింతగా గాయపర్చారు. ‘నాసేవకుడైన యోబు పలికినట్లు విూరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు, నా సేవకుడైన యోబు విూ నిమిత్తము ప్రార్థనచేయును.

విూ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను (యోబు 42:8) అని దేవ్ఞడే యోబును గూర్చి సాక్ష్యం చెప్పాడు. యోబు తన బాధల్లో సైతం దేవ్ఞడి సన్నిధిలో యుక్తమైనదిగా మాట్లాడాడు. ప్రభువ్ఞ వద్ద క్షమాపణ వేడుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏవి సంభవించినా అవన్నీ దేవ్ఞడి చిత్తంలో ఉన్నాయి అనే వాస్తవాన్ని గ్రహించి, ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించేందుకు కృషి చేయాలి.
పి.వాణీపుష్ప