ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో ఉద్రిక్తతలు

ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటు గ్రూపులకు మధ్య దాడులు

Syria
Syria

మాస్కో: సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో సిరియా ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటు గ్రూపులకు మధ్య దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. టర్కీ సైనిక చర్యతో అక్కడి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో పరిస్థితులు మెరుగుపడే వరకు తమ సేనలు అక్కడి నుండి కదలబోవని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రీ పెక్సోవ్‌ చెప్పారు. ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇడ్లిబ్‌లో టర్కీ సాయుధ దళాలు సైనిక చర్యకు దిగితే రష్యా స్పందన ఏమిటన్న ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్యలు చేశారు. సిరియా ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సైనిక చర్య సిరియాలో పరిస్థితులను మరింత దిగజారుస్తుందని ఆయన అన్నారు. ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో ఉద్రిక్తతలు పెరగకుండా నివారించటానికి తాము టర్కీ ప్రభుత్వంతో సంప్రదిస్తూనే వున్నామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/