ఇట‌లీలో హంగ్ పార్ల‌మెంట్‌

Italy Hng Parliament
Italy Hng Parliament

రోమ్‌: ఆదివారం ఇటలీ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ మెజార్టీనివ్వకుండా హంగ్‌ పార్లమెంట్‌తో ఓటర్లు తీర్పు వెలువరించటంతో ఇప్పుడు ప్రధాన రాజకీయ కూటములు అధికారానికి పోటీ పడుతూ బల సమీకరణలో తలమునకలయ్యాయి. సుదీర్ఘ రాజకీయ అస్థిరత అనంతరం జరిఇన ఈ ఎన్నికల్లో ఎక్కువ వోట్లు సాధించిన వలస వ్యతిరేక యాంటీ ఇమిగ్రేషన్‌ లీగ్‌ ఓటర్లు తమకు అనుకూలంగా తీర్పునిచ్చారని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఇదిలా వుండగా కొద్దిసేపటికే పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ వ్యతిరేక 5 స్టార్‌ మూమెంట్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా వున్నట్లు ప్రకటించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ మూడు ప్రధాన కూటముల్లో ఏ ఒక్కదానికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లభించే సూచనలు కన్పించకపోవటంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఆయా కూటములు దృష్టి సారించాయి. అయితే అద్యక్షుడు సెర్చియో మాటరెల్లా మాత్రం ఏప్రిల్‌ వరకూ ఈ అంశంపై చర్చించే అవకాశాలు కన్పించటం లేదని పరిశీలకులు చెబుతున్నారు.