ఇటలీ స్విమ్మర్‌ ఫిలిప్పోపై 8ఏళ్ల నిషేధం?

 Pilippo
Pilippo

ఇటలీ స్విమ్మర్‌ ఫిలిప్పోపై 8ఏళ్ల నిషేధం?

మిలన్‌(ఇటలీ),: నాలుగు సార్లు ప్రపంచ పోటీలలో పతకాలు గెలుచుకున్న ఇటలీ స్విమ్మర్‌ ఫిలిప్పో మాగననినిపై అక్కడి కోర్టు 8 సంవత్సరాల బ్యాన్‌ను విధించే అవకాశం ఉందని ఇటలీ మీడియా బుధవారం తెలిపింది. ఇటీవల ఫిలిప్పోతో పాటు మరో ఇంటర్నేషరనల్‌ స్విమ్మర్‌ మైఖేల్‌ సాన్చుకిలను మాదకద్రవ్యాలను అక్రమంగా వాడారని, సరఫరా చేసారని వచ్చిన ఆరోపరణలపై విచారణ చేసిన ఇటలీ అధికారులు ఇద్దరు స్విమ్మర్లు నేరానికి పాల్పడినట్లు తేల్చారు. దీతో ఫిలిప్పోపై 8ఏళ్ల నిషేధం, మైఖేల్‌పై 4ఏళ్ల నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిలిప్పో మాగననిని 100మీటర్ల ఈతపోటీలలో 2005,2007ల పోటీలలో ప్రపంచ విజేతగా నిలిచారు. 2004 ఏథెన్స్‌ ఒలంపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్నారు.