ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌

జెరూసలెం: యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. పరస్పర విరుద్ధ సిద్దాంతాలు, భావజాలాలతో కూడిన ఎనిమిది పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బెన్నెట్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గడిచిన రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులుగల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ఈ కూటమికి సరిగ్గా సాధారణ మెజారిటీ (61) ఉంది. కొత్త సంకీర్ణం ఏర్పడటంతో 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్‌ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్‌ నెతన్యాహు పదవీచ్యుతుడయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/