ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న భారత్‌ పర్యాటకులు

IMG
Hasan madha

ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న భారత్‌ పర్యాటకులు

హైదరాబాద్‌, ఆగస్టు 29: దేశంలో భారతీయ పర్యాటకులను మరింత ప్రోత్సాహించేందుకుగాను ఇజ్రా యెల్‌ పర్యాటక మంత్రిత్వశాఖ దేశంలో ఆరునగరాల్లో రోడ్‌షో నిర్వహిస్తోంది. ముంబైలో ఈనెల 21న ప్రారంభించిన ఈరోడ్‌షో అనంతరంఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు మీదుగా జరిగి 30వ తేదీ చెన్నైతో ముగుస్తుంది. ఇజ్రాయెల్‌ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ హసన్‌ మదా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ జుదా శామ్యూల్‌ తదితరులు హైదరాబాద్‌ రోడ్‌షోలో ఇజ్రాయెల్‌ పర్యాటకరంగ విశేషాలను వెల్లడించారు. ప్రతినగరం నుంచి 100కుపైగాట్రావెల్‌ ఏజెంట్లు ఈ రోడ్‌షోలో పాల్గొ న్నారన్నారు. డైరెక్టర్‌ హసన్‌మాదా మాట్లాడుతూ ఈ ఏడాది 34వేల మందికిపైగా భారతీయులు ఇజ్రాయెల్‌ను సందర్శించారన్నారు. 6శాతం భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగిందని, తమదేశానికి ఎల్‌ఆల్‌ నేరుగా భారత్‌ ను ఇజ్రాయెల్‌తో కలుపుతోందని, టెల్‌ అవీవ్‌కు నేరుగా మూడు వారం విమానాలు వేసవిలో మూడు, శీతాకాలం లో నాలుగు నడుపుతున్నాయన్నారు. అడీస్‌ అబాబామీదుగా నడుస్తాయన్నారు. ఢిల్లీనుంచి టెల్‌ అవీవ్‌కు ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌, రష్యన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎరోప్లోట్‌ ఢిల్లీనుంచి మాస్కోమీదుగా టెల్‌ అవీవ్‌కు సర్వీసులు నడుస్తున్నాయని, ఇవికాకుండా ఇతర యూరోపియన్‌ కార్యరియర్‌లు నడుస్తున్నట్లు వివరించారు.