ఇక సమరమే

BABU, MODI
BABU, MODI

ఇక సమరమే

ఎపి వ్యతిరేక పంథానుంచి వెనక్కి తగ్గని కేంద్రం
జోరందుకున్న కమలం,సైకిల్‌ పోరు
న్యాయపోరాటానికి చంద్రబాబు సిద్ధం
ఢిల్లీ కేంద్రంగా పోరాటం
జగన్‌ ఒత్తిడిపై బాబు ఎత్తుగడ

అమరావతి: ఏపి వ్యాప్తంగా కేంద్రం అనుసరిస్తున్న విధా నాలపై వ్యతిరేకిస్తున్న ప్రత్యేక హోదా,విభజన చట్టం అమలుకు ఉభయసభల్లో టిడిపి,వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు ఆందోళనలు చేపట్టి సభల నిర్వాహణ ప్రతిరోజు వాయిదా వేస్తున్న ఏపి వ్యతిరేక పందానుంచి కేంద్రం వెనక్కి తగ్గ డంలేదు.రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసు కొన్న పరిణామాలనుంచి బయట పడేందుకు బిజేపితో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలపి మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తూ ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెట్టుకోగా ఈ ఆర్థిక బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది.
రాష్ట్ర ప్రభుత్వం స్వయనా ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కేంద్రంతో పలుమార్లు సంప్ర దింపులు చర్చలు జరిపినా శూన్యమేను.చివరికి కేంద్రంనుంచి టిడిపి ఇరువురు ఎంపీలు మంత్రి పదవులకు రాజీనామా చేసినా కేంద్రంలో చల నం రాకపోవడంతో కమలం,సైకిల్‌ల మధ్యపోరు ఊపందుకొంది.టిడిపి కేంద్రమంత్రి పదవుల నుంచి వైదొలిగి దింపుడుకల్లం ఆశలతో ఎన్డీఎలో కొనసాగుతూ ఉభయసభల్లో టిడిపి ఎంపీలు ఆందోళనచేపట్టి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడ కట్టి ఆందోళన ద్వారా జాతీయస్థాయిలో టిడిపి దృష్టిమళ్ళించిన కేంద్రం నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నదనేది జగమెరిగిన సత్యం కేంద్రం చర్చల పేరిటా కేంద్రహోం,కేంద్ర ఆర్థికశాఖ, ఉపరితల రవాణా శాఖ,పరిశ్రమలు,వాణిజ్య శాఖల మంత్రులతో సంబంధిత మంత్రులతో సమావేశమైనా కేంద్రం పాతపాటే పాడుతోంది.

తాముహోదాకు మించిన సాయం,నిధులను కేం ద్రం రాష్ట్రానికి ఇచ్చిరదని ప్రకటించడం తప్ప ఎటు వంటి లెక్కలు చెప్పడం లేదు.రాష్ట్ర ప్రభు త్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తోంటే ఈ నాలు గళ్ళలో కేంద్రం విడుదల చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పలేదంటూ రాష్ట్రంపై కేంద్రం బుకాయిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు ముందుచూపుతో వ్యవ హరిస్తూ కేంద్రం రాష్ట్రంపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తెలివిగా ఎదుర్కొనడానికి తమపార్టీకి చెందిన ఎంపీలు మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించి,రాజీనామాకు కారణాలను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్ళారు.అనంతరం ఉభయసభల్లో ఆందోళనకు కేంద్రంనుంచి స్పందన కరువు కావడంపై ఇక న్యాయపోరాటం కొనసాగించడా నికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రస్థాయిలోని న్యాయ నిపుణులతో సంప్రదించి కేంద్రంపై న్యాయపోరా టానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది.మరోపక్క కేంద్రం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లోనికి తీసుకెళ్ళేందుకు ప్రతి నియోజకవ ర్గంలో సభలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ స్వయంగా పలు సభలకు ముఖ్యమంత్రి బాబు హాజరుకానున్నట్లు వినికిడి.

కేంద్రం రాష్ట్ర వ్యతిరేక విధానాలను ఎండకట్టి రాష్ట్రంలో బిజే పికి నూకలు దొరక్కుండా చేస్తామనే లక్ష్యంతో టిడిపి పెద్దఎత్తున వ్యూహరచన చేసినట్లు తెలిసింది.ఇక ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో టిడిపి ప్రత్యేకహోదా సాధించడం నిర్లక్ష్యం చేసి కేవలం ప్రత్యేకప్యాకేజీ అంటూ కేంద్రంతో మిలాఖత్‌ కావడం కారణంగానే రాష్ట్రా నికి అన్యాయం జరిగిందని ఆరోపణలు చేస్తు న్నారు.రాష్ట్రంలోనే నరేంద్రమోడీ ప్రభుత్వంపై జగన్‌ విమర్శలు చేయడమే కాని ఢిల్లీలో కాని రాష్ట్రంలో కాని బాబుపై విరుచుకుపడుతున్నట్లు కేంద్రంపై విమర్శలు చేయడంలేదు.

కేంద్ర ప్రభు త్వం టిడిపి ఎంపీలు మంత్రులుగా భాగస్వా మ్యమని కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయన ప్పుడు మద్దతు ఎందుకు ఉపసంహరించు కోవడం లేదని బాబుపై ఆరోపణలు చేశారు.