ఇక రాజకీయాలకు స్వస్తి: ఎంపీ జెసి

J C Diwakar reddy
J C Diwakar reddy

సంచనాలకు కేంద్ర బిందువైన ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టిడిపి ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తన అంతరంగంలో మాటను వెల్లడించారు. మరోవైపు ఆయన రాజకీయ వారసుడిగా పవన్‌రెడ్డి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపనున్నారని చెబుతున్నారు. పవన్‌ కూడా రాజకీయ కార్యక్రమాల్లో బిజిగా ఉన్నారు.అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్విట్టర్లాండ్‌, జెనీవాలో చదువుకున్న పవన్‌కు సినీ ప్రముఖులు, క్రికెటర్లతో పరిచయాలు ఉన్నాయి.