ఇక యువ ఓట‌ర్ల‌పై దృష్టి పెట్టాలిః మోది

modi, Amith Shah
modi, Amith Shah

న్యూఢిల్లీః గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరింత ఉత్సాహంగా ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దనీ… తర్వాతి విజయాలపై దృష్టిపెట్టాలని ఉద్బోధించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భావోద్వేగంతో మాట్లాడిన ఆయన… ఎన్నికల్లో విజయం పట్ల అమితానందం వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
2018 నాటికి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు సూచించారు. 2012 తర్వాత జన్మించిన వారంతా వచ్చే ఏడాది నాటికి ఓటు హక్కు పొందుతారనీ… వారిని కూడా దేశ సేవలో ప్రత్యేకించి సామాజిక, అభివృద్ధి కార్యక్రమాల్లో కలుపుకుని ముందుకెళ్లాలన్నారు. పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఇవాళ ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.