ఇక నుంచి భార‌త క్రికెట‌ర్లు బిజినెస్ ‘క్లాస్’ ప్ర‌యాణం…

BCCI
BCCI

ముంబాయిః భారత క్రికెటర్లు ఇప్పటి వరకు స్వదేశంలో జరిగే మ్యాచ్ ల సమయంలో విమానాల్లోని ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించేవారు. ఇక నుంచి వీరికి బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ అమోదం తెలిపింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ తాము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని తమతో సెల్ఫీలు దిగేందుకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారని అట‌గాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కాబ‌ట్టి విదేశాల్లో తాము పర్యటించేటప్పుడు సమకూర్చే బిజినెస్ క్లాస్ ప్రయాణాన్నే ఇండియాలో కూడా కల్పించాలని ఈ ఫిర్యాదులో కోరారు. దీనికి స్పందించిన బీసీసీఐ బిజినెస్ క్లాస్ ప్ర‌యాణానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.