ఇక నుంచి ఎంసెట్ ద్వారానే బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు

TS EAMCET
TS EAMCET

హైద‌రాబాద్ః ఎంసెట్ ‘సెట్’ రూల్స్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ సవరించింది. ఈ సందర్భంగా సవరించిన రూల్స్‌తో విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంసెట్ ద్వారా భర్తీ అయ్యే ఇంజినీరింగ్, ఏజీ బీఎస్సీ, మెడికల్, వెటర్నరీ కోర్సులతో పాటుగా ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును కూడా కలిపారు. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఇక నుంచి ఎంసెట్ ద్వారనే అడ్మిషన్లు పొందాలి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును అభ్యసించాలనుకునే విద్యార్థుల కనిష్ఠ వయసు డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు, గరిష్ఠ వయస్సు జనరల్, బీసీ అభ్యర్థులకు 22 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్లు ఉండే విధంగా నిబంధనలు మార్చారు.