ఇక ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్టు వెరిఫికేషన్‌

passport
passport

న్యూఢిల్లీ: పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ ఆలస్యమవుతుందని చింతించవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం
ఆలస్యాన్ని అరికట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తుంది. క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌
(సిసిటిఎన్‌ఎస్‌) సహాయంతో వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరితగతం ఆన్‌లైన్‌లో చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
పాస్‌పోర్టు సర్వీసుతో సిసిటిఎన్‌ఎస్‌ను అనుసంధానం చేసి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని
కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్రీషి తెలిపారు. అన్ని వివరాలు సిసిటిఎన్‌ఎస్‌తో అనుసంధానం
చేయనుందని ఆయన పేర్కొన్నారు.