ఇకపై నమస్తే చెబుతూ సంబరాలు చేసుకోవాలి!

ajinkya rahane
ajinkya rahane

ముంబయి: కరోనా మహామ్మారి కారణంగా మానవ జీవన శైలిలో మార్పులు రానున్నాయని భారత క్రికెటర్‌ అజింక్యా రహనే అన్నాడు. కరోనా కారణంగా మనుషులు ఒకరినొకరు తాకే వీలు లేకుండా పోతుంది. కరోనా అంతం తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయినప్పటికి మ్యాచ్‌ లో వికెట్‌ పడితే నమస్తే చెప్తూ సంబరాలు చేసుకోవాల్సిన రోజులు వస్తాయని, బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఫీల్డర్లు బౌలర్‌ వద్దకు రాకుండా అక్కడి నుంచే నమస్తే చెప్పి సంబరాలు చేసుకుంటారని రహనే అభిప్రాయపడ్డాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/