ఇకపై ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి

ఇకపై ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి
హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన చట్టం పేరును ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక ప్రగతి నిధిగా నామకరణం చేసినట్టు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు.. హైదరాబాద్లోని రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు, గిరజనుల సమగ్ర అభివృద్ధికి నిధులను ఏవిధంగా వెచ్చించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.