ఇకపై ఎన్నికలు జరిగే ప్రాంతంలో మాత్రమే కోడ్‌

 

PANCHAYATI Office
PANCHAYATI Office

హైదరాబాద్‌: ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా కోడ్‌ అమల్లో ఉండదు. ఇంతకు ముందు పంచాయతీ ఎన్నికలు జరిగినా.. మున్సిపల్‌, ప్రాదేశిక ఎన్నికలైనా.. రాష్ట్రమంతటికీ నియమావళి వర్తించేది. దీని వల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. పైగా.. ఈ ఏడాది మొత్తం ఎన్నికల సంవత్సరం కావడం.. అభివృద్ధి, సంక్షేమం, కొత్త పథకాల అమలుకు అడ్డంకిగా మారనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పరిధిలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కీలక సవరణలు చేసింది. అందుకు సంబంధించి ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ సోమవారం ఆదేశాలను జారీ చేశారు. దీని ప్రకా రం.. ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే అక్కడే కోడ్‌ అమలవుతుంది. అంటే.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పట్టణాలు, నగరపాలికలకు కోడ్‌ వర్తించదు.