ఇకనైనా మేల్కొనాలి : ధోనీ

Dhoni
న్యూఢిల్లీ : ఇకనైనా మేల్కొనాలంటూ సహచరులకు టీమిండియా కెప్టెన్‌ ధోనీ పిలుపునిచ్చారు. టి20 వరల్డ్‌ కప్‌ టోర్నీముందు టైటిల్‌ ఫేవరేట్‌గా నీరాజనాలు అందుకున్న జట్టుగా చేస్తున్న ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని, జట్టు సమిష్టిగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని ధోనీ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు టీమిండియా సమిష్టిగా ఆడలేక పోయిందని, జట్టుగా బాగా ఆడి ఉంటే భారత జట్టు ప్రదర్శన మరోలా ఉండేదని, గ్రూపు దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లంగా సమిష్టిగా ఆడతారని ఆశిస్తున్నానని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై ఆడనున్న మ్యాచ్‌లలో విజయం మాత్రమే సరిపోదని, రన్‌ రేట్‌ కూడా కీలకపాత్ర పోషిస్తుందని ధోనీ హితవు పలికాడు.