ఇంధ‌న ధ‌ర‌ల‌పై వ్యాట్ త‌గ్గించుట‌కు యోగి స‌ర్కార్ అనాస‌క్తి!

petrol prices
petrol prices

లక్నో: పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై వ్యాట్ త‌గ్గించడం త‌మ వ‌ల్ల కాదంటూ బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించే ప్రతిపాదన ఏమీ లేదని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో పన్ను ఇప్పటికే తక్కువగా ఉందని యూపీ వాణిజ్య పన్నుల శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ఆర్‌కే తివారీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. తక్కువ పన్ను విధింపు కారణంగా యూపీలో డీజిల్, పెట్రోల్‌కు సంబంధించి ఆదాయం పెరుగుదల 4 శాతం కంటే తక్కువ ఉందని, ప్రస్తుతానికైతే ఎలాంటి పన్ను తగ్గింపు లేదని తివారీ చెప్పారు.