ఇందిరాగాంధీకి నివాళుర్పించిన రాహుల్‌ గాంధీ

rahul
rahul

న్యూఢిల్లీ: ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఆమె సమాధి శక్తిస్థల్‌ వద్దకు యూపిఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో కలిసి వెళ్లి సమాధిపై పూలు ఉంచి నమస్కరించారు. ఖ మనసు నిండా ఆనందంతో ఈరోజు నానమ్మను గుర్తుచేసుకుంటున్నా. ఆమె నాకు ఎంతో నేర్పించారు. అంతులేని ప్రేమను పంచారు. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె పట్ల ఎంతో గర్వపడుతున్నాగ అని రాహుల్‌ ఇందిరాగాంధీని గుర్తుచేసుకుంటూ ట్వీట్‌ చేశారు.