ఇందిరమ్మ ఆలోచనలే కాంగ్రెస్‌ బాట

RAGHU VEERA
RAGHU VEERA

ఇందిరమ్మ ఆలోచనలే కాంగ్రెస్‌ బాట

విజయవాడ : ఏడు సంవత్సరాలు ఎఐసిసి అధ్యక్షురాలుగా, 16సంవత్సరాలు దేశానికి ప్రధానిగా సేవలందించిన ఉక్కుమహిళ ఇందిరాగాంధీ దేశ ప్రజల గుండెల్లో ఇందిరమ్మగా సుస్ధి రస్ధానం పొందారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరమ్మ త్యాగాలను, దార్వినికతను ఆమె శత జయంతి సందర్భంగా స్మరించుకోవడమే కాకుండా నేటి తరానికి ఆమె చేసిన కృషిని గుర్తు చేయడం కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.

ఇందిరమ్మ ఆశయాలకు పునరంకితం అవుతూ ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలను గత నవంబర్‌19నుంచి ఏడాది కాలంగా కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందన్నారు. దేశం లో నేడు ఎదురవుతున్న అనేక సమస్యల పరిష్కారానికి ఇందిరమ్మ ఆలోచనలు, ఆచరణ నేటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని కాంగ్రెస్‌ పార్టీ విశ్వసిస్తుందన్నారు. ఇందిరమ్మ ఆశయాలే దివిటీగా స్వీకరించి నేటి కాంగ్రెస్‌ విధానాలను రూపొందించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతోందన్నారు. ఈ నేపధ్యంలో ఎపిసిసి ఆధ్వర్యంలో ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలను గత ఏడాదినవంబర్‌ 19వ తేదీన కర్నూల జిల్లా కోడుమూరులో రైతు మహాసభ జరిపి ఘనంగా ప్రారంభిం చుకున్నామని తెలిపారు. నవంబర్‌ 19 నుంచి రాష్ట్రంలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జగిరినా ఇందిరమ్మను స్మరించుకుంటూ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే నెల నవంబర్‌ 19వ తేదీ ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆం ధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అనేక కార్యక్రమాలను రూపొందించింది.