ఇంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందా అన్పించింది.

NAGA CHAITANYA
NAGA CHAITANYA

అమ్మాయిల్ని చూడగానే
ఇంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందా అన్పించింది.

ప్రేమమ్‌, రారండో§్‌ు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నాగచైతన్యహీరోగా నటించిన డిఫరెంట్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం’యుద్ధం శరణం.. లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా కృష్ణ ఆర్‌.వి.మారిముత్తుని దర్శకుడిగా పరిచయంచేస్తూ వారాహి చలనచిత్రం బేనర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈచిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.. శ్రీకాంత్‌ పవర్‌ఫుల్‌ విలన్‌పాత్రలో నటించిన మైండ్‌ గేమ్స్‌తో, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈచిత్రం యూత్‌,ఫ్యామిలీస్‌, ఫ్యాన్స్‌కి నచ్చేలా రూపొందింది.. ఈసందర్భంగా నాగచైతన్య మాట్లాడారు.

ఈ మధ్య స్టూడెంట్స్‌ని కలవటం ఎలా అన్పించింది?
చాలా బాగుంది.. ఈసినిమా మెయిన్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది.. అందుకని రిలీజ్‌కి ముందే ఈ సినిమా గురించి అందరికీ తెలియజెప్పటానికి కొన్ని కళాశాలలకు వెళ్లి స్టూడెంట్స్‌ని కలవటం జరిగింది.. ముఖ్యంగా ఈసినిమాకు వారి సపోర్ట్‌ కావాలి.. అందుకే ఓపెన్‌గా వెళ్లి అందర్నీ కలిశాం.. ప్రతి ఒక్కరూ మంచి ఎనర్జీ ఇచ్చారు.. మెయిన్‌గా భీమవరం ఉమెన్స్‌కాలేజికివెళ్లినపుడు చాలా క్రేజీగా అన్పించింది.. హెవీ క్రౌడ్‌తో అమ్మాయిల్ని చూడగానే నాకు ఇంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందా అన్పించింది.. ప్రతిఒక్కరూ సెల్ఫీలు తీసుకున్నారు.. వారందరితో కలిసి మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది.

థ్రిల్లర్‌ అంశాన్ని ఎంచుకోవటానికి రీజన్‌ఝ
ఫస్ట్‌టైం థ్రిల్లర్‌ జోనర్‌తో ఈసినిమా చేశాను.. బట్‌ థ్రిల్లర్‌ అయినా కూడ సినిమాలో అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి.. లవ్‌స్టోరీ మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు కామెడీ కూడ ఉంటుంది.. స్క్రీన్‌ప్లే థ్రిల్లర్‌ ఫార్మాట్‌తో ఉంటుంది.

యాక్షన పార్ట్‌ ఎంతవరకు ఉంటుంది?

క్లైమాక్స్‌లో శ్రీకాంత్‌తో ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంది.. అది సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. దాంతోపాటు సినిమాలోకొన్ని యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి. అవి కూడ ఎక్కువ ప్రొజెక్ట్‌ చేయటం లేదు.. సినిమా బ్రెయిన్‌ ఇంటెలిజెంట్‌ ప్లేలోరన్‌ అవుతుంది.

డైరెక్టర్‌ కృష్ణ మీ ఫ్రెండ్‌ అని ఛాన్స్‌ ఇచ్చారా? లేక డైరెక్టర్‌ అవుతాడనా?
డైరెక్టర్‌ అవుతాడని నమ్మకంతోనే ఈసినిమా ఛాన్స్‌ ఇచ్చాను.. నాకుఎప్పట్లుంచో ఒక డ్రీమ్‌ ఉంది.. ఫ్రెండ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని ఏ వర్క్‌తతోనైనా బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి పనిచేస్తే ఆ రిజల్ట్‌ ఔట్‌పుట్‌ వేరేలా ఉంటుంది.. ఆ ఎక్స్‌పీరియన్స్‌ ఈసినిమాతో వచ్చింది..యుద్ధం శరణం స్క్రిప్టు మా అందరికీ నచ్చింది.. ఈసినిమాకు ప్రతిఒక్కరూ సింక్‌ అయ్యారు కాబట్టి టేకాఫ్‌ అయ్యింది.

నిర్మాత సాయి కొర్రపాటి మేకింగ్‌?
సాయిగారు న్యూ కమర్స్‌కు ఇచ్చేఎంకరేంజ్‌మెంట్‌ హ్యాట్సాఫ్‌.. ఈ సినిమా 80శాతం వరకు అందరూ కొత్తవాళ్లే వర్క్చ్‌ఏశారు.. స్టోరీస్‌ నచ్చి కరెక్ట్‌ జడ్జిమెంట్‌తోసినిమాలు తీస్తారు ఆయన. కొత్తవాళ్లని ఇంట్రడ్యూస చేస్తుంటే ఇండస్ట్రీకిగ్రో అవుతూ ఉంటుంది.. కొత్త కంటెంట్‌ వస్తుంది.. సాయిగారి లాంటి ప్రొడ్యూసర్స్‌ ఉండాలి…

శ్రీకాంత్‌గారితో వర్క్‌ చేయటం?
చాలా ఆనందంగా ఉంది.. ఆయన నెగిటివ్‌ రోల్‌ చేస్తారని అస్సలు ఊహించలేదు.. ఆయన క్యారెక్టర్‌ చాలా హైలెట్‌ అవుతుంది.. నా క్యారెక్టర్‌కి కూడ మంచి ఎలివేషన్‌ ఇచ్చారు.

లావణ్యత్రిపాఠి క్యారెక్టర్‌ గురించి?
చాలా రియలిస్టిక్‌గా నటించింది.. కంటెంట్‌ ఉన్న రోల్స్‌నే తను యాక్సెప్ట్‌ చేసి చేస్తుంది.. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు.. ఈసినిమాలో త్రూఅవుట్‌ క్యారెక్టర్‌లో నటించింది.. సెకండాఫ్‌లో నన్ను బాగా సపోర్ట్‌చేసే క్యారెక్టర్‌ అది.. ఫెంటాస్టిక్‌గా చేసింది.

ఈసినిమా చూశాక మీకెలాంటి ఫీలింగ్‌ కలిగింది?
రెగ్యులర్‌ ఫిల్మ్‌లా కంకుండా చాలా కొత్తగా ఉంటుంది. డెఫనెట్‌గా తెలుగు ప్రేక్షకులకు, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. కంటెంట్‌ వైజ్‌, స్క్రీన్‌ప్లే వైజ్‌గా ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది..

మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
ఈసినిమాలోనేను ఒక డ్రోన్‌ మేకర్‌ని.. ఆ డ్రోన్‌ని ఒక క్యారెక్టర్‌టా డిజైన్‌ చేశాం.. సినిమాలో ఆ డ్రోన్‌ క్యారెక్టర్‌కూడ త్రూఅవుట్‌ రన్‌ అవుతుంది.. యూత్‌కి చాలా కొత్తగా ఉంటుంది.. ప్రతిఒక్కరూ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారు.

యుద్ధం, శరణం.. ఎవరితో?
యుద్ధం శ్రీకాంత్‌తో,, శరణం, నా ఫ్యామిలీతో..
ఇంతకీ మీ పెళ్లెపుడు?
అక్టోబర్‌ 6న గోవాలో తెలుగు సంప్రదాయపద్దతిలోజరుగుతుంది.. 7న క్రిస్టియన్‌ మ్యారేజ్‌ ఉంటుంది.. రిసెప్షన్‌ అనేది హైదరాబాద్‌లోనాన్నగారు చాలా గ్రాండ్‌గాప్లాన్‌ చేస్తున్నారు.

తదుపరి చిత్రాలు?
చందు మెండేటి దర్శకత్వంలోమైత్రీ మూవీమేకర్స్‌ బేనర్‌లో సవ్యసాచి మూవీ చేస్తున్నాను. తాతగారి బర్త్‌డే సెప్టెంబర్‌ 20న ఆ సినిమా ప్రారంభమవుతుంది.. కంప్లీట్‌ పక్కా కమర్షియల్‌ సినిమా ఇది.. సినిమా ఎప్పుడెప్పుడు చేయాల అని చాలా ఎగ్జయిట్‌గా ఉంది.. తర్వాత మారుతి దర్శకత్వంలో చినబాబుగారి సినిమా ఉంటుంది.. స్క్రీప్ట్‌ వర్త్‌ జరుగుతోంది.. అంటూ ముగించారు.