ఇండొనేషియా ఓపెన్‌లో సైనాకు నిరాశ

saina-marin
న్యూఢిల్లీ : ఇండొనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో బాగా ఆడి క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రవేశించిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. స్పెయిన్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌ చేతిలో సైనా నెహ్వాల్‌ 22-24,11-21 తేడాతో పరాజయం పాలైంది. తొలిగేమ్‌లో ఒక దశలో సైనా ధాటిగా ఆడటంతో విజయం సాధించే సూచనలు కనిపించాయి.అయితే కరోలినా మారిన్‌ పుంజుకొని చెలరేగడంతో తొలిగేమ్‌లో సైనా ఓటమి తప్ప లేదు.కాగా రెండవ గేమ్‌లోనూ విజయం మారిస్‌నే వరించింది.దీంతో సైనా నెహ్వాల్‌ టోర్నీ నుంచి వైదొలగింది. సైనా నెహ్వాల్‌ ఇండొనేషియా ఓపెన్‌ టైటిల్‌ను గతంలో మూడు సార్లు 2009,2010,2012 గెలుచుకున్న సంగతి తెలిసిందే.