ఐఆర్‌సిటిసి కుంభకోణంలో సిబిఐకి డాక్యుమెంట్లు దాఖలు

Lalu
Lalu prasad yadv

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వేలో హోటళ్ల కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) 20వేల డాక్యుమెంట్లను పాటియాలా హౌస్‌ కోర్టులో సమర్పించింది. ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి చేపట్టిన దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లను సిబిఐ కోర్టుకు సమర్పించింది. లాలూ భార్య, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌లను ఈ కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నావళిని నెల రోజుల అనంతరం సిబిఐ కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించింది.