ఇండిగో షేర్లు భారీ పతనం

indigo
indigo

ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్‌ భారీగా తగిలింది. గత ఆర్థిక సంవత్సరం 2017-18 చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో ఇండిగో షేరు 18 శాతానికిపైగా పతనమైంది. 2016 జనవరి తర్వాత ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్‌ రాజీనామా తర్వాత షేర్లు 26 ఏప్రిల్‌ నుంచి తగ్గుముఖం పట్టాయి. 26శాతం క్షీణించి దాదాపు రూ.13650కోట్ల విలువైన మార్కెట్‌ విలువ కోల్పోయింది. నాల్గవ త్రైమాసికం జనవరి-మార్చిలో ఇండిగో నికరలాభం 75 శాతం పతనమై 118 కోట్ల రూపాయలను నమోదు చేసిందిద. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణమని ఇండిగో మార్కెట్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18శాతం పెరిగి రూ.6057కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ.1751కోట్ల నుంచి 2338 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8శాతం పెరిగి రూ.5,141.99కోట్ల నుంచి రూ.656.84 కోట్లను చేరుకుంది. ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ.2338 కోట్లు పెరిగి రూ.1751కోట్లకు చేరుకుంది.