ఇండస్ట్రియల్‌ హబ్‌గా ఓర్వకల్లు

chandra babu, ap cm
chandra babu, ap cm

కర్నూలు: ఏపి సియం చంద్రబాబు మంగళవారం కర్నూలు జిల్లాలోని కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జలధార ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారనుందని చంద్రబాబు చెప్పారు. 200 ప్రముఖ కంపెనీలు ఓర్వకల్లుకు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.