ఇంట్లో దెయ్యం…నాకేంటి భయం

Allari Naresh
అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రీ, సీమటపా కాయ్ చిత్రాలు హిలేరి యస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన

BVSNPRASAD

బి.వి.ఎస్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇంట్లో దెయ్యం…నాకేంటి భయం. జూన్‌ 30 హీరో అల్లరి నరేస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్ర విశేషాలను తెలియచేశారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ జూన్‌ 23 నుండి కంటిన్యూగా షూటింగ్‌  జరుగుతోంది. నాగేశ్వరరెడ్డి ఇంట్లో దెయ్యం నాకేంటి భయం కథ చెప్పగానే డెఫినెట్‌గా చాలా మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుందనిపించి ఇమ్మీడియట్‌గా స్టార్ట్‌ చేశాం. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్‌ అన్నారు. దర్శకుడు. జినాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారీ చిత్రాలు నిర్మించే చత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

NAGESWAR