ఇంటి బాధ్యత ఇద్దరిదీ

KITCHEN GUIDES
WORK SHARING IN HOUSE

ఇంటి బాధ్యత ఇద్దరిదీ

”గృహస్థాశ్రమం మిగిలిన ఆశ్రమాల కంటే కీలకమైనది కాబట్టి, దీన్ని ”జ్యేష్ఠాశ్రమం అన్నారు. గృహస్థుకి కష్టాలు వస్తే అందరికీ కష్టాలే! ఎందుకంటే గృహస్థు అందరినీ పోషించాలి. తన సేవలను అందించాలి. దక్షప్రజాపతి వంటివాడు తను రచించిన ”దక్షస్మృతిలో గృహస్థ ధర్మాలు, సదాచారము, ఆధ్యాత్మిక జ్ఞానం మొదలైన విషయాలనెన్నిటినో కూలంకషంగా చర్చించాడు. పంచభూతములతో కూడిన ఈ ప్రపంచం అంతా ఆ పరబ్రహ్మ స్వరూపమేననే ఎరుక గలిగి ఉండడం, ఏ జీవినీ బాధపెట్టకుండా ఉండడం, ”కుటుంబం అంటే తను, భార్య, పిల్లలు మాత్రమే కాదని, ప్రపంచమంతా ఒక వసుధైక కుటుంబం అని భావించాలి. గృహస్థు స్వార్థానికి తావ్ఞ ఇవ్వకూడదు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనుకోవడం మాట దేవ్ఞడెరుగు. ఈ రోజుల్లో తన భార్య, పిల్లలు, తప్పించి, కన్నవారూ, తోడబుట్టి నవారు కూడా అక్కర్లేకపోతోంది మగవాడికి.

ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న తతంగం ఇది. గృహిణి, ఇంటి వాకిట్లో ముగ్గును ఉంచాలి. తులసి మొక్కను పెంచి, రోజూ నీళ్లు పోసి, దానికి నమస్కరిస్తూ ఉండాలి. వాకిట్లో తులసి మొక్క ఉంటే ఇంటిలో ఉన్నవారందరికీ శుభమే! ఇంటిలో దేవ్ఞని పటాలు, దేశభక్తులు, భారతమాత మొదలైన వారి పటములు అలంకరించాలి. ఇంట్లోని వారందరూ ప్రాతః కాలాన్నే లేచి, స్నానాదికాలు తొందరగా కానిచ్చి, బొట్టుపెట్టుకొని, దేవ్ఞని పూజ చేసేట్లుగా కనీసం ఊదు ఒత్తి అయినా వెలిగించి, నమస్కారం పెట్టుకునేట్లుగా అలవాటు చెయ్యాలి. పెద్దలు ఇంట్లో ఉంటే పిల్లలకు వారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకోమని నేర్పించాలి. మంచాన పడిన వృద్ధులు ఉంటే, విసుగుకోకుండా వారిని పలకరించి, యోగక్షేమాలు కనుక్కోవాలి.

అందరూ కలిసి పర్వదినాలలోనైనా దేవాలయానికి వెళ్లాలి. అతిధి అభ్యాగతులను ఆదరించి ఉన్నంతలో వారికి ఆహారపానీయాలు సమర్పించి, తృప్తిపరచాలి. గృహిణిని అనుసరించే యజమాని, పిల్లలు, కుటుంబసభ్యులు,మొదలైన వారి ప్రవర్తన ఉంటుందని గ్రహించి, తాను ఆచరించి చూపించాలి. ”గృహస్థు తన భార్యను కేవలం ఇంటిపనులు చెయ్యడానికి, పిల్లలను కని పెంచడానికి పెండ్లి చేసుకున్నట్లుగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. భారతీయ సమాజంలో స్త్రీకి గౌరవస్థానం ఉంది.

”మాతృదేవోభవ అంటూ మొదటి స్థానాన్ని స్త్రీలకే ఇచ్చారు. ఇంట్లో స్త్రీలు అవమానం పొందితే ఆ ఇంట ఏ కార్యం తలపెట్టినా జయప్రదం కాదు. భార్య పక్కన లేనిదే ఏ శుభకార్యమూ ఆచరించడానికి అర్హత లేదు పురుషుడికి. అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకుంటూ, కుటుంబంలోని వారికి సేవచేస్తూ, తాను తిన్నా, తినకున్నా, భర్త, పిల్లల కడుపులు నింపాలని వారిని ఆరోగ్యంగా ఉంచాలని చూస్తుంది గృహిణి. సంస్కారవంతురాలైన గృహిణి ఇంటిని దేవాలయంగా, విద్యాలయంగా, ఆదర్శగృహంగా తీర్చిదిద్దగలదు. ఈ రోజుల్లోనైతే ఆర్థికంగా కూడా భర్తకి అండగా ఉంటున్నారు స్త్రీలు. అయితే తామూ గణిస్తున్నాం అని, భర్తకి, అత్తమామలకి సేవలు ఎందుకు చెయ్యాలి? మేమేం నౌకర్లమా? అనీ, నీ తల్లిదండ్రులకు నౌకర్లను పెట్టుకుని చేయించుకోమని, అహంకరించేవారు ఉండవచ్చు.