ఇంటి దొంగలను విచారించండి

varla ramaiah
varla ramaiah

విజయవాడ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ను విచారించాలని టిడిపి నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. కేసును పక్కతోవ పట్టిస్తున్నారని, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా ఉంది ఈ కేసు విచారణ. ఇంటి దొంగలను ఎందుకు అరెస్టు చేయలేదో జవాబు చెప్పాలని కోరారు. ఎంపి అవినాష్‌రెడ్డి కాల్‌ డేటా ఎందుకు తీసుకోలేదని అడిగారు. తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలసునని చెప్పారు. దర్యాప్తు ఆపాలని సిట్‌కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/