ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సేవ‌లుః కేటీఆర్‌

KTR
KTR

హైద‌రాబాద్ః తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ పనితీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.