ఇంటర్‌ ఫస్టు ఇయర్‌ ‘ఎథిక్స్‌, హ్యుమన్‌ వాల్యూస్‌ పరీక్ష 28, 31న

Career
Career

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ ఫస్టు ఇయర్‌ విద్యార్థులకు ఈనెల 28, 31 తేదీల్లో ‘ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సజ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈపరీక్షను నిర్వహిస్తామన్నారు. ఈ రెండు సబ్జెక్టులు పాస్‌ అయితేనే..ఇంటర్‌ రెండేళ్ల కోర్సు పాస్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. అన్ని సబ్జెక్టులు పాసై..ఈరెండు ఫెయిల్‌ అయినా సర్టిఫికేట్‌ ఇవ్వరని కార్యదర్శి స్పష్టం చేశారు. అందువల్ల తప్పనిసరిగా ఈపరీక్ష రాసి విద్యార్థులు పాస్‌ కావాలని ఆయన కోరారు. హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపామని ఆయన పేర్కొన్నారు.