ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మార్పులు

Students1
Students

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మార్పులు

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, కోర్సు విషయంలో తరచుగా వినిపించే మాటలు. దేశంలో ఏటా లక్షల మంది ఇంజినీ రింగ్‌ పూర్తి చేస్తున్నప్పటికీ అందులో పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యం గలవారు కొద్దిమందే ఉంటున్నారు. ఈ నేప థ్యంలో దశాబ్దాలుగా ఒకే తరహాలో కొనసాగుతున్న ఇంజి రింగ్‌ కరిక్యులమ్‌లో మార్పులకు రంగం సిద్దమైంది.

మారు తున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని స్కిల్‌ మ్యాన్‌ పవర్‌ను రూపొందిం చడంతోపాటు పరిశ్రమలు, జాబ్‌ మార్కెట్‌ కోరుకుంటున్న నైపుణ్యాలను, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్ని కల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసిటిఈ) .. ఇంజినీరింగ్‌ కోర్సు కరిక్యు లమ్‌లో భారీ మార్పులు చేసింది.

కరిక్యులమ్‌ రూపకల్పనకు ఎఐసిటిఈ గత రెండేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకు ఐఐటి ప్రొఫెసర్లు నిపుణులు, పరిశ్రమ వర్గాలతో సబ్జెక్ట్‌ల వారీగా ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆధ్యయనం చేశాకే కమిటీలు ఇచ్చిన సూచల మేరకు థియరీ కంటే ప్రాక్టికల్స్‌ కు ప్రాధాన్యం ఇచ్చేలా, పరిశ్రమ అవసరాలకు అనుగుణం గా ఉండేలా ఇంజినీరింగ్‌ కరిక్యులమ్‌లో ఎఐసటిఈ మార్పులు చేర్పులు చేసింది. అంతేకాకుండా విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించే అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి సారించింది. సక్సెస్‌పుల్‌ ఇంజినీర్‌గా నిలవాలంటే టెక్నికల్‌ నాలెడ్జ్‌తోపాటు సామా జిక స్పృహ అవసరం అనే అంశానికి కూడా ఐసిటిఈ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం.. నిరంతరం సమీక్ష ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇండస్ట్రీ రెడీగా ఉండటం లేదనే వాదన పరిశ్రమ వర్గాల నుంచి తరచుగా వినిపిస్తుంది.

ప్రాజెక్ట్‌ వర్క్‌ మినహాయిస్తే ఇంజినీరింగ్‌ కోర్సులో విద్యార్థులకు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు లభించే పరిస్థితి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కరిక్యులమ్‌ను సవరించారు. అంతేకాకుండా పరి స్థితులకు అనుగుణంగా ఎఐసిటిఈ కరిక్యులమ్‌ను నిరం తరం సమీక్షిస్తుంది. ఆ మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తుంది. ఏటా కరిక్యులమ్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై చేర్చించడానికి వీలుగా ప్రతి యూని వర్సిటీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

ఇంజినీరింగ్‌ కోర్సులో ఇప్పటిదాకా థియరీకి 220 క్రెడిట్స్‌ ఉండగా.. సవరించిన కరిక్యులమ్‌లో దాన్ని 160కి తగ్గిం చింది. అందులో 14 క్రెకిట్లు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ద్వారా సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు 150 నుంచి 160 క్రెడిట్లు సాధింస్తే.. ఇంజనీరింగ్‌ డిగ్రీకి అర్హతగా పరిగణి స్తారు. అదనంగా 20 క్రెడిట్స్‌ పూర్తిచేస్తే ఆనర్స్‌తో కూడిన ఇంజినీరింగ్‌ డిగ్రీ (అడిషనల్‌ మైనర్‌ ఇంజినీరింగ్‌)కి అర్హులవ్ఞతారు. ఇంజినీరింగ్‌లో పిజి కోర్సులో మోడల్‌ కరిక్యులమ్‌లో 68 క్రెడిట్స్‌ ఉంటాయి. ఈ మేరకు పిజిలో 18 స్పెషలైజేష న్స్‌ను ఆవిషరించారున. ఎంబిఎ/పిజిడిఎం కోర్సులకు కనీస క్రెడిట్స్‌ 102గా నిర్ణయించారు. సవరించిన పాఠ్య ప్రణాళిక ప్రకారం ప్రాక్టికల్‌ ఆసైన్‌ మెంట్స్‌కు పెద్దపీట వేశారు.

ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. ఈ మేరకు విద్యార్థులు సంబంధిత పరిశ్రమలో విధిగా రెండు నుంచి మూడు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. సదరు ఉద్యోగం కోసం పరిశ్రమలు, జాబ్‌ మార్కెట్‌ ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యా ర్థులు సముపార్థించుకోవాలన్న లక్ష్యంతో ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు.

ఇంటర్‌వీషిప్స్‌ ద్వారా ప్రాక్టికల్‌ ఎక్స్‌ పోజర్‌, రియల్‌ టైం ఎక్స్‌పీరియన్స్‌ లభిస్తుంది. తరగతి గదుల్లో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగలిగే అవకాశం వస్తుంది. సంబంధించిన రంగంలోని ఆధునిక ధోరణులపై అవగాహన ఏర్పడు తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్ట్‌వర్క్‌, సెమి నార్లకు 15 క్రెడిట్స్‌ కేటాయించారు. పరీక్షలో అధిక శాతం అప్లికేషన్‌ఓరి యెంటేషన్‌, ప్రాక్టికల్‌ థింకింగ్‌తో సమాధా నాలు ఇచ్చే విధంగా ప్రశ్నపత్రాలను రూపొందించే అవ కాశం ఉంది.

సాంకేతికతతోపాటు.. సామాజిక స్పృహ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టెక్నికల్‌తోపాటు నాన్‌ టెక్నికల్‌ అంశాలపై కూడా అవగాహన ఉండాలనే అంశానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సావజిక స్మృహ ఉండటం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న పరి ణామాలను ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఇంజినీ రింగ్‌ విద్యార్థులపై ఉంది. ఈ నేపథ్యంలో ఆయా అంశా లపై అవ గాహన కల్పించేందుకు కొన్ని సబ్జెక్ట్‌లను చదవ డం చదవడం తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో పర్యా వరణ శాస్త్రం, భారత రాజ్యాంగం, ఎథిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌ తదితర సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టారు. ఎసెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ నాలెడ్జ్‌లో ఇండియన్‌ ఫిలాసఫి, లింగ్విస్టిక్స్‌, యోగా, సంప్రదాయ కళా రూపాలు వంటి అంశాలు ఉంటాయి. తద్వారా భారతీయ సంప్రదాయం, నైతిక విలువలు, సంస్కృతి, వార సత్వం, ప్రభుత్వం పరి పాలన వంటి విషయాలపై విస్గ్రత జారిజ్ఞానాన్ని పెంపొం దించుకునే అవకాశం విద్యార్థులకు ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కోర్సులో సి సి++ జావా వంటి అంశాలు ఉన్నాయి. ఇవి బేసిక్స్‌ అందిస్తాయే తప్ప ప్రస్తు తం వస్తున్న మార్పులకు సరిపోయే ఆధునిక నైపుణ్యాలను కల్పిం చలేవ్ఞ. ఈ క్రమంలో విద్యార్థులు నూతన అంశాల పై దృష్టి సారించాలి.

ఇందుకోసం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటి) ఆటోమేషన్‌, బిగ్‌ డేటా, ఆర్టిఫిషీయర్‌ ఇంటెలి జెన్స్‌ తదితర అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌లకు ఇంజినీరింగ్‌ సిలబస్‌ లో చోటు కల్పిం చారు. ఈ అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌ల అవసరం నేడు ప్రతి రంగంలో ఉంటోంది. కోర్సులోనే వీటిపై పరి జ్ఞానాన్ని పెంచు కుంటే ఉద్యోగ సాధన మరింత సులువ్ఞ గా మారుతుంది. సిద్దం చేసేందుకు ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యా ర్థులను తదనుగుణంగా సిద్ధం చేసేందుకుమూడు వారాల ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని ఎఐసిటిఈ సూచిం చింది. ఈ ప్రోగ్రామ్‌లో ఫిజికల్‌ యాక్టిఇటీ, క్రియే టివ్‌ ఆర్ట్స్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, లిటరరీ, ప్రొఫెషనల్‌ మాడ్యూల్స్‌, నిపుణులతో లెక్చర్స్‌, కాలేజ్‌ సమీప నివాస ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లడం, పెర్మిలైజేషన్‌ టు డిపార్ట్‌మెంట్‌/ బ్రాంచ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ వంటి కార్యక్రమా లు ఉంటాయి.

ప్రొఫెషనల్‌.. ఓపెన్‌ ఎలక్టివ్‌ 1.విద్యార్థులు కేవలం తాము ఎంచుకున్న బ్రాంచ్‌కే పరిమి తం కాకుండా ఇతర సబ్జెక్ట్‌ల్లో ఊడా అవగాహన పెంపొం దించుకునేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా భిన్నమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలవ్ఞతుంది. 2.ఇందుకోసం ప్రొఫెషనల్‌ ఎలక్ట్రివ్‌ కోర్సెస్‌, ఓపెన్‌ ఎలక్టివ్‌ కోర్సెస్‌ అనే విధానాన్ని ప్రవేశ పెట్టారు. 3.ప్రొఫెషనల్‌ ఎలక్టివ్‌ కోర్సెస్‌లో విద్యార్థులు తమ బ్రాంచ్‌ కాకుండా ఇతర ఇంజిరింగ్‌ కోర్సులను అధ్యయనం చేయాలి. 4.ఓపెన్‌ ఎలక్టివ్‌ కోర్సుస్‌లో విద్యార్థులు అందుబాటులో ఉన్న కోర్సుల్లో ఏదైనా కోర్సును ఎంపిక చేసుకోవచ్చు.

ఇండస్ట్రీ రెడీగా … నూతన కరిక్యులంలో ప్రతిపాదించిన మార్పులు స్వాగ తించే విధంగా ఉన్నాయి. తాము ఆశిస్తున్న నైపుణ్యాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు బలంగా వాదిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అటువంటి వాదనలకు చెక్‌ పెట్టి విద్యార్థులను ఇండస్ట్రీ రెడీగా తీర్చి దిద్దడానికి నూతన కరిక్యులం దోహదం చేస్తుంది. ఇంజి నీరింగ్‌ అనేది ఇండస్ట్రీ రిలేటెడ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఈ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో థియరీ కంటే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఎక్కువ ఉండాలి. ఆ దిశలో ప్రాక్టికల్‌ క్రెడిట్స్‌ను పెంచారు. తద్వారా ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌ ఎక్కువగా లభిస్తుంది. ఇందుకు థియరీ సబ్జెక్ట్స్‌ను పెంచారు. అంతేకాకుండా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఇంటర్‌వీషిప్స్‌ కోసం కొన్ని క్రెడిట్స్‌ కూడా ఇస్తున్నారు.

కరికుల్యమ్‌ తో పాటు కాలేజీలకు కూడా ఎఐసిటిఈ కొన్ని సూచనలు చేసింది.ఫ్యాకల్టీ, విద్యార్థి నిష్పత్తిలో కూడా మినహాయింపు ఇచ్చింది. కాలేజీలు కూడా కరికుల్యమ్‌తోపాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు పాటిం చాల్సిన కొన్ని నిబంధనలను కూడా ఐసిటిఈ విడు దల చేసింది. వాటిలో ప్రధానమైనవి ల గత ఐదేళ్లలో మొత్తం సీట్లలో భర్తీ అయిన సీట్ల సంఖ్య 30 శాతంలోపు ఉంటే ఆ కాలేజీలో సీట్లను 50 శాతానికి కుదిస్తారు ల ఇంజినీరింగ్‌ కాలేజీలో ఐదు డివిజన్లు, 300 సీట్లకు మాత్రమే అనుమతిస్తారు. ల బి ఫార్మసీ కాలేజీలో రెండు డివిజన్లు, 300 సీట్లకు మాత్రమే అనుమతిస్తారు.

ల ఫ్యాకల్టీ నిష్పత్తి బిటెక్‌లో 1.20 బిఫార్మసీలో 1.15గా ఉండాలి. విజిటింగ్‌ ఫ్యాకల్టీల సంఖ్య 10 శాతంలోపే ఉండాలి. విజిటింగ్‌ ఫ్యాకల్టీకి పిజి/పిహెచ్‌డితోపాటు ఇండస్ట్రీలో 10-15 ఏళ్ల అనుభవం ఉండాలి. ఏటా ఆగస్టు 1 నుంచి మొదటి సెమిస్టర్‌, జనవరి 1 నుంచి రెండో సెమిస్టర్‌ ప్రారంభం ఆవాలి. బిటెక్‌ ప్రతి ఆరుగురు విద్యార్థులకు, బీఫార్మసీలో ప్రతి ఎనిమిది మంది విద్యార్థులకు ఒక కంప్యూటర్‌ ఉండాలి. సబ్జెక్ట్‌ల వారీగా క్రెడిట్స్‌ కేటగిరీ క్రెడిట్స్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ (మేనేజ్‌మెంట్‌ కోర్సులతో కలిపి) 12 బేసిక్‌ సైన్స్‌ కోర్సెస్‌ 25 ఇంజినీరింగ్‌ సైన్స్‌ కోర్సుస్‌ (వర్క్‌షాప్‌, డ్రాయింగ్‌, బేసిక్‌ ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌ / కంప్యూటర్‌ తదితరాలు కలిపి 24 ప్రొఫెషనల్‌ కోర్‌ కోర్సెస్‌ 48 ప్రొఫెషనల్‌ ఎలక్టివ్‌ కోర్సెస్‌ (స్పెషలైజేషన్‌/బ్రాంచ్‌) 18 ఓపెన్‌ సబ్జెక్ట్స్‌ ఎలక్టివ్స్‌ ఫ్రమ్‌ ఆదర్‌ టెక్నికల్‌/ ఎమర్జింగ్‌ సబ్జెక్ట్స్‌ 18 ప్రాజెక్ట్‌ వర్క్‌, సెమినార్‌ ఇంటర్న్‌షిప్‌ 15 మొత్తం : 160