ఇంగ్లాండు మహిళల క్రికెటు జట్టు విజృంభణ

NATAL
NATAL

ఇంగ్లాండు మహిళల క్రికెటు జట్టు విజృంభణ

లండన్‌: మహిళలప్రపంచకప్‌లో మంగళవారం ఇంగ్లాండ్‌- పాకిస్తాన్‌ జట్లకు జరిగిన క్రికెట్‌మ్యాచ్‌లో తొలుత బ్యా టింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌జట్టు రికార్డు సృష్టించింది. 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 377పరుగులు చేసింది. నటా లియో సివర్‌ 92బంతుల్లో 14ఫోర్లు, 4సిక్సర్లతో 137 పరుగులు, హీతర్‌నైట్‌ 109బంతుల్లో 12ఫోర్లు రెండు సిక్సర్లతో 106పరుగులతో ఇద్దరు బ్యాట్స్‌ఉమెన్‌లు సెం చరీలు చేయగా, డిఎన్‌వ్యాట్‌ (42), ఎఫ్‌సి విల్సన్‌ (33)పరుగులు చేయడంతో ఇంగ్లాండ్‌ 377పరుగులు చేసింది. పాకి స్తాన్‌ బౌలర్లలో అస్మవియా ఇక్బాల్‌ 3వికెట్లు, ఇంతి యాజ్‌ 2వికెట్లు, సానామీర్‌, నస్రా సాందు చెరో వికెట్‌ తీశారు. 378 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ చేధనలో విఫలమైంది. 7పరుగుల వద్ద నహీద్‌ (3)తో వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటవెంటనే జావెరియా(11), అస్మియా (5)పరుగులతో వెనుదిరిగారు. మరోఓపెనర్‌ అయెషా జఫార్‌(56),నైన్‌ అబిది (23)పరుగులతో క్రీజులో పోరాడుతున్నారు.