ఇంగ్లండ్‌ భారీ స్కోరు

s2
England 4th test

ఇంగ్లండ్‌ భారీ స్కోరు

ముంబై: టీమిండియాతో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇంగ్లండ్‌ తొలిరోజు గురువారం ఆటముగిసే సమయానికి 5 వికెట్లకు 288 పరుగులు చేసింది.దీంతో ఓపెనర్లు కుక్‌ 46 పరుగులు,జెన్నింగ్‌ 112 పరుగలతో సెంచరీ చేసి మెరుగైన ఆరంభం ఇచ్చారు.దీంతో సిరీస్‌లో తొలిసారి ఇంగ్లండ్‌ జట్టు కుదురుకున్నట్లు కనిపించింది.అయితే జడేజా సంధించిన బంతికి కుక్‌ పెవిలియన్‌కు చేరాడు.అనంతరం జో రూట్‌ 21 పరుగుల వద్ద అశ్విన్‌ మాయాజాలానికి బొల్తా కొట్టాడు.కాగా తరువాత వచ్చిన మెయిన్‌ అలీ 50 పరుగులతో జెన్నింగ్స్‌తో కలిసి కుదురుకున్నాడు.హాఫ్‌ సెంచరీ సాధించి ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. తరువాత స్వీప్‌ షాట్‌కు యత్నించి కరుణ్‌ నాయర్‌ చేతికి చిక్కాడు.అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్‌ కు గుడ్‌ లెంగ్త్‌ బంతిని సంధించిన అశ్విన్‌ ఫలితం రాబట్టాడు.పుజారా చక్కని క్యాచ్‌ అందుకోవడంతో ఇంగ్లండ్‌ జట్టు నాలుగవ వికెట్‌ కోల్పోయింది.

అనంతరం బెయిర్‌ స్టో 2 పరుగుల వద్ద ఊరించే బంతని సంబంధించిన అశ్విన్‌ ఉచ్చులో పడి పెవిలి యన్‌కు చేరాడు.దీంతో క్రీజులో బెన్‌ స్టోక్స్‌25 పరుగులు,జోస్‌ బట్లర్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.దీంతో తొలిరోజు ఆటముగిసే సమయా నికి ఇంగ్లండ్‌ జట్టు 94 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.టీమిండియా బౌలర్లులో అశ్విన్‌ నాలుగు వికెట్లు తీసుకోగా, జడేజాకు ఒక వికెట్‌ లభించింది.దీంతో 30 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అశ్విన్‌ నాలుగు వికెట్లు తీయడం విశేషం. అశ్విన్‌ మాయాజాలం నాలుగవ టెస్టు తొలిరోజు పేస్‌కు అనుకూ లిస్తుందన్న పిచ్‌పై అశ్విన్‌ తన వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు.కాగా 99 పరుగుల వద్ద కెప్టెన్‌ కుక్‌ సిన్నర్‌ జడేజా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మరో 37 పరుగులకే ప్రమాదకరమైన బ్యాట్స్‌ మెన్‌ జోరూట్‌ 21 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు చిక్కాడు.లంచ్‌ విరామం తరువాత 230 పరుగుల వద్ద కానీ భారత్‌కు వికెట్‌ దక్కలేదు.కాగా మూడవ సెషన్‌లో బౌలింగ్‌ ప్రారంభించిన వెంటనే అశ్విన్‌ ఒక్క బంతి తేడా తోనే సెంచరీ,హాఫ్‌ సెంచరీ సాధించిన జెన్నింగ్స్‌,మెయిన్‌ అలీ వికెట్లను తీసి భారత బృందంలో ఆనందం నింపాడు.చివరలో 249 పరుగుల వద్ద జానీ బెయిర్‌స్టో 14 పరుగుల వద్ద వికెట్‌ తీసి కోహ్లీ సేనకు మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశం ఇచ్చాడు.

కుక్‌ అరుదైన ఘనత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అలిస్టక్‌ కుక్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.కాగా భారత్‌పై టెస్టుల్లో రెండు వేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్‌ స్థానం సంపాదించు కున్నాడు. ఇప్పటి వరకు అయిదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్‌పై రెండు వేల, అంతకు పైగా పరుగులు సాధించారు.కుక్‌ ఆరవ స్థానంలో నిలిచాడు.అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగా డిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 2555 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కాగా ఈమ్యాచ్‌లో కుక్‌ 46 పరుగులతో కొద్దిలో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీతో సత్తా చాటిన జెన్నింగ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగుతున్న నాలుగవ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.కాగా ఓపెనర్‌కుక్‌ 46 పరుగులు,జెన్నింగ్‌ 112 పరుగులు చేసి మెరుగైన ఆరంభాన్నిచ్చారు. ఇంగ్లండ్‌ ఒపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ జెన్నింగ్‌ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. కాగా ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.అంతకు ముందు 2006లో ఇంగ్లండ్‌ ఆటగాడు ఒవై షా ఇక్కడ చేసిన 88 పరుగులు ఇప్పటి వరకు అరంగేట్రపు అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోరు.

కాగా తాజాగా దాన్ని జెన్నింగ్స్‌ అధిగమించాడు.మరోవైపు భారత్‌తో 2006 నుంచి చూస్తే అరంగేట్రం లోనే 50కి పైగా పరుగులు సాధించిన అయిదవ ఇంగ్లండ్‌ ఆటగాడిగా జెన్నింగ్‌ నిలిచాడు. టీమిండియాలో అందరూ సెంచరీ వీరులే ఇంగ్లండ్‌తో జరుగుతన్న నాలుగవ టెస్టులో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లంతా సెంచరీ వీరులే.కాగా బ్యాట్స్‌మెన్‌,బౌలర్లు, వికెట్‌ కీపర్‌ అందరూ సెంచరీలు చేసిన వారే.తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఫస్ట్‌ క్లాస్‌ కెరీయర్‌లో ఒక సెంచరీ అయినా చేశారు.కాగా ఈ మ్యాచ్‌లో మురళీ విజ§్‌ు,కెఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లీ,కెకె నాయర్‌, అశ్విన్‌, పార్ధీవ్‌, జడేజా,జయంత్‌,భువనేశ్వర్‌ కుమార్‌,ఉమేష్‌ యాదవ్‌లు ఆడుతున్నారు. జింబాబ్వేతో 1992-93 ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే విధంగా తుది జట్టులో అందరూ సెంచరీ వీరులే ఉన్నారు.కాగా ఇలాంటి ఘనటనలు ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో తొమ్మిదిసార్లు జరిగాయి.