ఇంకో 15 ఏళ్లు మాదే పాలన

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌: తెలంగాణలో తమకు అడ్డులేదని రాష్ట్ర మంత్రి కేటిఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో ఆర్య వైశ్య నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటిఆర్‌ మాట్లాడుతూ.. ఇంటింటికీ నీళ్లివ్వడం ఖాయమన్నారు. ఇంకో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ..కేసిఆర్‌ సియంగా ఉంటారన్నారు. ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయని..నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులొస్తారన్నారు. అవసరం ఐతే ఇంటింటికీ తులం బంగారం ఇస్తామని కూడా వస్తారు. ఇలాంటోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలిన కేటిఆర్‌ హెచ్చరించారు.