ఆ సీక్రెట్ చెప్పను…
ఆ సీక్రెట్ చెప్పను…
డబ్బుతో కొన్న వస్తువును దాచి పెట్టుకుంటే ఏంలాభం? ఉపయెగించటం తెలిస్తే దాని విలువ తెలుస్తుంది. మా ఫ్రెండ్ ఒకతను ఓ కారుకొని దాని మీద కవర్ వేసి అలానే ఉంచాడు. నా దృష్టిలో మనీ అనేది కైనైటిక ఎనర్జిలా ట్రాన్ఫర్ కావాలి. కానీ పొటెన్షియల్ ఎనర్జీలా మన దగ్గరే ఉండిపోకూడదు. కోట్లు ఖర్చుపెట్టటానికి ఓ వస్తువు కొన్నాడంటే నేను ఆనందపడను.. వాడి ఆనందం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాడంటే అపుడు ఆనందంగా ఉంటుంది. నేను కరెన్సీ నోట్లను ముట్టకోననని జగన్ (పూరీ జగన్నాద్) చెప్పిందినిజమే.. నాకు చెక్కీ, డ్రాఫ్ట్కి తేడా తెలియదు. కరెన్సీ ముట్టుకోకుండా ఎలా బ్రతికేస్తున్నాను? అనిచాలా మందికి డౌట్.. ఆ సీక్రెట్ చెప్పను. అని తెలివిగా ఓ కథ చెప్పారు వర్మ.. ఇదంతా ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చి కరెన్సీ గురించి ఇలా ఓ కథ చెప్పారు.