ఆ వేలి ముద్రలు జయలలితవే

 

Jayalalitha
Jayalalitha

అనారోగ్యంతో జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అన్నాడీఎంకే అభ్యర్థుల బీ-ఫారాలపై జయలలిత వేలి ముద్రలు పెట్టారు. ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడులో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే  అభ్యర్థులకు ఇచ్చిన బీ- ఫారాలలలో పార్టీ అధినేత్రిగా ఆమె సంతకం తప్పని సరి. అయితే అనారోగ్యంతో ఆమె సంతకం చేయలేని స్ధితిలో ఉండటంతో వేలి ముద్రలు వేశారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగడమే కాకుండా అనుమానాలు కూడా వ్యక్తమైన సంగతి తెలిసిందే. కాగా విచారణ సంఘం ఎదుట అప్పట్లో ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు వాంగ్మూలమిస్తూ ఆ వేలి ముద్రలు జయలలితవేనని స్పష్ఠం చేశారు.